CM Chandrababu : తక్కువ తినమని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచన

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహార నియమాలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల వంట నూనె మరియు 3 కిలోల చక్కెర సరిపోతుందని ఆయన తెలిపారు. ఉప్పు, నూనె మరియు చక్కెర వాడకం తగ్గించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రజలందరూ ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

TAGS