Sandeep Kishan : కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ని మూసేయడం అన్యాయం..ఆమెకోసం నేనున్నా : సందీప్ కిషన్
Sandeep Kishan : ఇటీవల కాలం లో సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీ ని సంపాదించినా కుమారి ఆంటీ గురించి మన అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతం లో ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా సాయికుమారి అనే ఈ మహిళా రోడ్డు సైడ్ ఫుడ్ సెంటర్ ని ఒకటి ఏర్పాటు చేసింది. ఇక్కడి ఆహరం అత్యంత రుచికరంగా ఉండడంతో ఒక నెటిజెన్ రీసెంట్ గా వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు.
ఆమె వండించే ఐటమ్స్ చూసి నోరు ఊరిపోయిన నెటిజెన్స్ అడ్రస్ కనుక్కొని మరీ వెతుక్కుంటూ వెళ్లి ఆమె ఫుడ్ సెంటర్ లో ఫుడ్ ని తినేవారు. రోజురోజుకి జనాలు గుమ్మిగూడడంతో కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో కస్టమర్ల రద్దీ కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని, పోలీసులు ఈమె ఫుడ్ సెంటర్ ని ముయ్యించేసారు. దీనికి ఆమె మీడియా ముందుకు వచ్చి ఆందోళన చేసింది.
పోలీసులు అన్యాయంగా మా ఫుడ్ సెంటర్ ని ఎందుకు మూయించారో అర్థం కావడం లేదు అంటూ కుమారి ఆంటీ బాధపడింది. అయితే ఈ ఫుడ్ సెంటర్ మూతపడే ఒక రోజు ముందే ప్రముఖ హీరో సందీప్ కిషన్ తన కొత్త సినిమా ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ని వీక్షించాడు. అయితే ఆమె ఫుడ్ సెంటర్ ని మూసేసారు అనే వార్త తెలియగానే సందీప్ కిషన్ చాలా బాధపడ్డాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇది చాలా అన్యాయం. కుమారి గారు మధ్యతరగతి మహిళా గా సిటీ కి వచ్చి ఎలా గొప్పగా డబ్బులు సంపాదించాలో తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. అలాంటి ఆమెకు ఇలా జరగడం దురదృష్టకరం. ఆమెకి ఎప్పుడూ మేము అండగా ఉంటాం, ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాము’ అంటూ సందీప్ కిషన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుండి కుమారి ఆంటీ యదావిధిగా ఫుడ్ సెంటర్ ని నడుపుకోవచ్చు అని అనుమతి ఇచ్చేసాడు. ట్రాఫిక్ పోలీసులు ఆమెని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు అంటూ హెచ్చరికలు జారీ చేసాడు. అంతే కాకుండా అతి త్వరలోనే ఆమె ఫుడ్ సెంటర్ కి విచ్చేస్తాను అని కూడా చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.