wedding : పెళ్లి పందిరిలోనే దంపతుల ఘర్షణ.. వధువు మృతి

wedding

wedding

wedding : పెళ్లయిన కొద్ది సేపటికే ఘర్షణపడిన దంపతులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో గాయాలైన నవ వధువు మృతి చెందింది. వరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో లిఖితశ్రీ, నవీన్ లకు బుధవారం వివాహమైంది. పెద్దల ఆశీస్సులు అందుకున్న అనంతరం ఇద్దరు మాట్లాడుకునేందుకు ఒక గదిలోకి వెళ్లారు.  లోపల ఏం జరిగిందో తెలియదు కానీ.. నూతన దంపతులు ఇద్దరు ఒకరితో మరొకరు గొడవపడి, చేతికి అందిన వస్తువులతో కొట్టుకున్నారు.

తీవ్రంగా గాయాలపాలైన వారిద్దరిని బంధువులు కేజీఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ లిఖితశ్రీ మృతి చెందింది. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కోలారు ఆస్పత్రికి తరలించారు. వివాహమైన గంటలోనే దంపతులు ఎందుకు దాడి చేసుకున్నారో ఇరు కుటుంబాల సభ్యులకు అర్థం కాలేదు. అండర్ సన్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TAGS