BJP Alliances : ఎన్నికలకు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల హడావిడి మరింత పెరిగింది. వైసీపీ అధినేత జగన్ ‘సిద్ధం’ పేరుతో సభలు పెడుతుంటూ..అటు టీడీపీ నుంచి చంద్రబాబు ‘‘రా..కదిలిరా’’ అంటూ పిలుపునిస్తుంటే.. లోకేశ్ ‘శంఖారావం’ పూరిస్తున్నారు. జనసేనాని కూడా త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరికపై త్వరలోనే క్లారిటీ రానుంది.
బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్నది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులపై తేల్చేయాలని భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపై స్పష్టతనిచ్చి ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో జాతీయ నాయకత్వం పొత్తులపై తేల్చేయాలని అనుకుంటోంది. రాష్ట్ర నాయకత్వానికి పొత్తులపై స్పష్టతనిచ్చి ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని భావిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పొత్తులపై తాడోపేడో తేల్చుకునేందుకు మూడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి పిలిపించి మరోసారి పొత్తులపై డిస్కస్ చేయనున్నారు. విశాఖ టూర్ లో ఉన్న పవన్.. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ నుంచి పిలుపు రాగానే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ హైకమాండ్ తో చంద్రబాబు, పవన్ సమావేశమై పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత కు రానున్నారు.
అన్నీ కుదిరితే ఈ వారంలోనే పొత్తులపై కీలక ప్రకటన చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3 వేల మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశావహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.