Jagan family : వైఎస్ కుటుంబంలో కీలక పరిణాయం చోటు చేసుకుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆధిపత్యం కోసం వైసీపీ అధినేత జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. ఈ విషయమై.. హైదరాబాద్ ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తన తల్లి, సోదరి కుట్ర పన్ని షేర్లు బదిలీ చేసి తన భార్యకూ, తనకు కంపెనీపై ఆధిపత్యం లేకుండా చేశారని జగన్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన సోదరి రష్మిలకు, తనకు మధ్య ఎలాంటి ప్రేమానురాగాలు లేవని ఈ పిటిషన్ లో జగన్ ప్రస్తావించారు. ఏమాత్రం దాతృత్వం లేకుండా ఆమె తనపై చేస్తున్న ఆరోపణలు వ్యక్తిగత స్థాయికి దిగజారాయని, రాజకీయ శక్తుల ప్రోద్భలంతో ఆమె తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు.
ఎన్సీఎల్టీలో సెప్టెంబరు 9న తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై జగన్, భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీల షేర్ల వివాదాన్ని పరిష్కరించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కంపెనీలో 51 శాతం షేర్లు తన పేరు మీద ఉన్నట్లు డిక్లేర్ చేయాలని కోరారు. నవంబరు 8న జగన్ పిటిషన్ పై విచారణ జరుగనుంది.