Citadel : ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్.. ప్రేమికుల నుంచి శత్రువులుగా మారిన సమంత-వరుణ్
Citadel : గ్లోబల్ సిరీస్ ‘సిటాడెల్’కు భారతీయ ప్రతిరూపమైన ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ ను మేకర్స్ మంగళవారం (అక్టోబర్ 15) ముంబైలోని జుహు ప్రాంతంలో ఆవిష్కరించారు. రాత్రి సోడియం లైట్ కింద నిల్చున్న వరుణ్ ధావన్ పై డచ్ టిల్ట్ షాట్ తో ట్రైలర్ మొదలవుతుంది. సమంతా రూత్ ప్రభు పాత్ర తన కుమార్తెను సురక్షితమైన ట్రంక్ లో ఉంచి, వారితో సన్నిహితంగా పోరాడుతున్న శత్రువులను షూట్ చేయడం తర్వాతి షాట్లలో కనిపిస్తుంది.
వరుణ్, సమంత పాత్రను వారి అసాధారణ పోరాట నైపుణ్యాల కారణంగా గూఢచారి సంస్థలోకి ఎలా తీసుకున్నారనేది తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో ఎక్స్‌ప్లోజివ్ యాక్షన్, హై ఆక్టేన్ స్టంట్స్, ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ ఎక్సైట్ మెంట్ అన్నీ అసాధారణమైన పెర్ఫార్మెన్స్ తో పాటు గ్రాండ్ విజువల్ స్కేల్ తో అదరగొట్టాయి.
వరుణ్ పాత్రతో పోరాటం చేస్తున్న నటి హనీని (సమంత పోషించింది) ఒక సైడ్ షో కోసం ఎజెన్సీ రిక్రూట్ చేస్తుంది. వారిని యాక్షన్, డిటెక్టివ్, నమ్మకద్రోహం లాంటి వాటిలోకి నెట్టివేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత వారి ప్రమాదకరమైన గతం గుర్తుకురావడంతో విడిపోయిన హనీ, బన్నీ తిరిగి కలిసి తమ కుమార్తె నదియాను రక్షించేందుకు పోరాడుతారు.
దీని గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ -‘నేను గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా బన్నీ ఉంటాడు. డిటెక్టివ్ గా ఆయన డిఫరెంట్ లైఫ్ ను లీడ్ చేస్తుండడమే కాకుండా ఆయన వ్యక్తిత్వంలోని ప్రతీ అంశానికి రెండు విభిన్న కోణాలున్నాయి. నటుడిగా ఇది చాలా ఉత్తేజాన్నిచ్చింది. కథలో సంక్లిష్టంగా అల్లిన ఆయన చిత్రణకు అనుభవాలు, పాత్రల మేళవింపు అవసరమైంది. కఠినమైన విన్యాసాలు, యాంప్డ్ యాక్షన్ సన్నివేశాల కోసం మానసికంగా సిద్ధంగా ఉన్నాను, ఇది నా కెరీర్ లో అత్యంత సవాలుతో కూడిన వెబ్ సిరీస్ లో ఒకటిగా మారింది.’ అన్నారు.
రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకేతో కలిసి సీతా ఆర్ మీనన్ రచించారు. కేకే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీం, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివాంకిత్ పరిహార్, కాష్వీ మజ్ముందర్ తదితరులు నటిస్తున్నారు. గ్రిప్పింగ్ స్టోరీలైన్, రిచ్ క్యారెక్టర్ డెప్త్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పోటీపడే ఇంటెన్సివ్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, స్టంట్స్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లో భాగం అయ్యే అవకాశం, కనెక్టెడ్ డిటెక్టివ్ కథలతో కూడిన కీలకపాత్ర పోషించే అవకాశం నన్ను ఈ ప్రాజెక్ట్ వైపు ఆకర్షించిందని సమంత అన్నారు.
‘హనీని జీవితంలోకి తీసుకురావడానికి అవసరమైన సవాళ్లు, ప్రయత్నాలు వృత్తి పరంగా, వ్యక్తి గతంగా తనపై ప్రభావాన్ని చూపాయి. ఇది నా కెరీర్ లో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో ఒకటిగా మారింది. దేశంలోనే కాకుండా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అనేక దేశాలు, ప్రాంతాల్లో ప్రేక్షకులు ఈ సిరీస్ ను పూర్తిగా ఆస్వాధిస్తారని నేను నమ్ముతున్నాను.’ అని ఆమె అన్నారు.
డీ2ఆర్ ఫిల్మ్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, రుస్సో బ్రదర్స్ ఏజీబీఓ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ నవంబర్ 7న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.