AP CID Surveillance on Social Media : ఏపీలో సోషల్ మీడియా ఇక పూర్తి స్థాయి నిఘా ఉంటుందని, అతి చేస్తే జైలుకెళ్లడం ఖాయమని ఇటీవల ఏపీ సీఐడీ చీఫ్ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో అసభ్య కరంగా, రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ హెచ్చరికలు, అరెస్టులు ఒక్క ప్రతిపక్ష పార్టీల నాయకులు, పేదలకే వర్తిస్తాయా లేదంటే అధికార పార్టీ శ్రేణలకు కూడా వర్తిస్తాయా అని ప్రతిపక్ష పార్టీల శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియా లో వెటకారంగా పోస్టులు పెడుతున్న వారిని ఏపీ పోలీసులతో పాటు సీఐడీ వెంటాడుతున్నది. కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపిస్తున్నది. అయితే ఇప్పటివరకు ఇవన్నీ ఏకపక్షంగా ఉన్నాయని ఏపీలో ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక సోషల్ మీడియాపై మానిటరింగ్ ఉండేలా సీఐడీ ఒక మానిటరింగ్ సెల్ ను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఏ ఐడీ నుంచి పోస్టులు పెడుతున్నారు..తదిరాలపై నిఘా పెడుతున్నారు. ఇక దీని కోసం 25 మంది నిపుణులను తీసుకున్నట్లు సమాచారం. వీరితో మరో 100 మందికి ప్రత్యేక్ష శిక్షణ ఇప్పించి సోషల్ మీడియా పోస్టులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.
అయితే ఎన్నికల ముందు ఇలా సోషల్ మీడియా పోస్టులపై నిఘా అంటూ ఏపీ సీఐడీ రంగంలోకి దిగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను ఇబ్బంది పెట్టడంలో భాగంగానే ఈ రకమైన చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తున్నదని పలువురు వాపోతున్నారు. ఏదేమైనా కొంతకాలంగా ఏపీలో సీఐడీ తీరు పై విమర్శలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, ఎనిమిది వరుస కేసులు, ఇలా జరిగిన పరిణామాలన్ని సీఐడీని వేలెత్తి చూపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాను కూడా టార్గెట్ చేసింది.