CID searches : ఏపీలో పలుచోట్ల మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు

CID searches
CID searches : ఏపీలో పలుచోట్ల మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పెద్దాపురం మండలం చిన బ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్ పరిశ్రమలో అధికారులు సోదాలు చేశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. నల్లజర్ల మండలం ఆవపాడు, రాయవరం మండలం చెల్లూరు తాళ్ళపూడి మండలం అన్నదేవరపేటలోని డిస్టిలరీల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారు. డిస్టిలరీలకు ఎంతమేర మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.