JAISW News Telugu

CID orders : ‘ఆడుదాం ఆంధ్ర’ నిధుల దుర్వినియోగంపై చర్యలకు సీఐడీ ఆదేశం

CID orders

CID orders

CID orders : గత వైసీపీ పాలనలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చర్యలకు సీఐడీ ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ తదితర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చర్యలు ప్రారంభమయ్యాయి. వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు సీఐడీకి చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డీ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై స్పందించింది.

తదుపరి చర్యలు తీసుకోవాలని వియవాడ నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు రూ.150 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు ఇప్పటికీ ఫిర్యాదులొస్తున్నాయి.

నాసిరకం క్రీడా కట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యతలో డొల్లతనం అప్పట్లోనే బయటపడింది. జర్సీల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.

Exit mobile version