JAISW News Telugu

Nara Lokesh:నారా లోకేష్‌కు రెడ్ బుక్ తెచ్చిన తంట‌..సీఐడీ 2 ర‌కాల మెమోలు దాఖ‌లు

Nara Lokesh:ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య కేసుల యుద్ధం న‌డుస్తోంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడిని స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిందిన వైసీపీ ప్ర‌భుత్వం ఇప్పుడు టీడీపీ యువనేత నారా లోకేష్‌ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో లోకేష్‌ను 41ఏ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని విజ‌య‌వాడ ఏసీబీ కోర్టు, హైకోర్టులో సీఐడీ రెండు ర‌కాల మెమోలు దాఖ‌లు చేసింది.

ఏసీబీ కోర్టులో నారా లోకేష్ 41ఏ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని, అరెస్ట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీఐడీ మెమో ఫైల్ చేసింది. ఈ మెమోను ఉద‌యం ప‌రిశీలించి ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తి ప‌క్క‌న పెట్టారు. సాయంత్రం ఈ మెమోను ఈ నెల 28వ తేదీన బెంచ్ మీద‌కు విచార‌ణ‌కు ఉంచాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఇదిలా ఉంటే నారా లోకేష్‌పై విజ‌య‌వాడ ఏసీబీ మ‌రో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌కు ఎన్‌బీడ‌బ్ల్యూ జారీ చేయాల‌ని, ఈ కేసులో ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌నికోరింది.

ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధ‌న‌ల‌ను లోకేష్ ఉల్లంఘించార‌ని ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిట‌ని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించ‌గా.. ప‌త్రిక‌ల క్లిప్పింగ్‌ల‌ను సీబీఐ త‌రుపు న్యాయ‌వాది చూపించారు. లోకేష్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని, రెడ్ బుక్ పేరులో అధికారుల‌ను లోకేష్ బెదిరించార‌ని పిటీష‌న్‌లో పేర్కొంది. 41ఏ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు తీసుకునే అధికారం కోర్టుకు ఉండ‌ద‌ని పిటీష‌న్‌లో సీఐడీ పేర్కొంది. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌పై సీఐడీ ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో లోకేష్ ఇప్ప‌టికే హైకోర్టును ఆశ్ర‌యించ‌గా 41 ఏ నోటీసు ఇచ్చి విచారించాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేష్‌కు ఇప్ప‌టికే 41 ఏ నోటీసులు జారీ అయిన విష‌యం తెలిసిందే.

Exit mobile version