Johnny Master Arrest : ఉత్తారాదికి చెందిన ఓ డ్యాన్సర్ ను లైంగిక వేధించాడని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైన తర్వాత జానీ మాస్టర్ కనిపించడం లేదు. ఈ కేసు నుంచి బయట పడడానికి తప్పించుకుతిరుగుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు నాలుగు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జానీ మాస్టర్ ముందుగా నెల్లూరుకు పారిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ చివరికి అతడు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
లైంగిక వేధింపుల కేసులో ప్రత్యేక పోలీసు బృందం జానీ మాస్టర్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకుంది. పోలీసులు జానీ మాస్టర్ ను నేరుగా ఉప్పరపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించనున్నారు.
తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు తనపై లైంగిక పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇటీవల జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వెంటనే ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటుచేసి జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ అత్యాచారం చేసిన సమయంలో బాధితురాలు మైనర్ కావడం గమనార్హం. ఫిలింఛాంబర్ కు అనుబంధంగా ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార వేదిక కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిచింది.
టాలీవుడ్ పెద్దలు జానీ మాస్టర్ పై చర్యలకు సిద్ధమయ్యారు .అతని అన్ని సభ్యత్వాలను రద్దు చేసేందుకు పలు సంఘాలు కూడా రెఫర్ చేశాయి. ఫిలిం చాంబర్ ఏర్పాటు చేసిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ కూడా ఈ కేసును విచారణకు తీసుకుంది. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇచ్చి, తదుపరి చర్యలను ప్రకటిస్తామని కూడా వెల్లడిచింది.