Chiranjeevi : తమ్ముడు పవన్ కల్యాణ్ ను గెలిపించాలని నిన్న మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల నుంచి తప్పుకున్న చాలా కాలం తర్వాత ఆయన రాజకీయంగా ఒకరికి సపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి. అయితే పవన్ కల్యాణ్ కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ను తమ్ముడికి ఇవ్వాలని చిరు నిర్ణయించుకున్నారు. అందుకే జనసేనకు రూ.5 కోట్ల విరాళం కూడా అందించారు. తమ్ముడి తరఫున ప్రచారం చేస్తారని అనుకున్న ఆయన ఓ వీడియా ద్వారా పవన్ కల్యాణ్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలకు విన్నవించారు. తల్లి కడుపున పవన్ కల్యాణ్ చివరగా పుట్టినా జనం కోసం సేవ చేయడంలో తపించే వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తిని కచ్చితంగా గెలిపించాలని విన్నవించుకున్నారు.
ఇదిలా ఉండగా చిరంజీవి వీడియో బయటకు వచ్చిన వెంటనే అందరూ ఊహించినట్టుగానే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా కౌంటర్ ఇచ్చేందుకు బయలుదేరారు. ఇందులో సినిమా రంగం నుంచి వైసీపీలో పనిచేస్తున్న పోసాని కృష్ణమురళి స్పందించారు. ‘‘చిరంజీవిని నమ్మి కాపుల జీవితాలు నాశనమయ్యాయి.. చిరంజీవి పార్టీ పెడితే 18 సీట్లు వచ్చాయి. చిరంజీవి ఏనాడైనా ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా..? ఇప్పుడు పవన్ న గెలిపించమని ఎలా అడుగుతారు. చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారన్నారు. ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి ఇప్పుడు మళ్లీ జనసేన తరఫున ఎలా ప్రచారం చేస్తారు. చిరంజీవి మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.’’ అని విమర్శించారు.
కాగా, చిరంజీవిపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవి ఓ పౌరుడిగా తనకున్న అభిప్రాయాన్ని చెప్పారు.. పిఠాపురం వాసులను తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఓటు వేయమని కోరారు. ఇందులో తప్పేముంది.. ప్రజాస్వామ్యంలో ఓటు వేయమనడం తప్పెలా అవుతుంది. పవన్ కు ఓటు వేయాలో , వేయకూడదో నిర్ణయించుకోవాల్సి పిఠాపురం ఓటర్లు..ఇందులో వైసీపీ వాళ్లకు ఎందుకు నొప్పి అని విరుచుకుపడుతున్నారు. రాజకీయాల్లో ఉండాలో..వద్దో ఒక వ్యక్తిగా చిరంజీవికి హక్కు ఉంది. ఎంతో మంది రాజకీయ నాయకులు రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఇతర రంగాల్లోకి వెళ్లడం లేదా.. రాజకీయాల్లోకి వచ్చిన వారు అక్కడే ఉండాలనే రూల్ ఏమి లేదు కదా అని వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు.