JAISW News Telugu

Megastar Chiranjeevi : చిరంజీవి ఎమోషన్ పోస్ట్.. తన భార్య పుట్టిన రోజున పెట్టిన మెగాస్టార్..

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేసేంత సాహసం చేయడం లేదు. సింపుల్ సిటీ, హార్డ్ వర్క్ అనే పదాలు ఆయనను చూసే పుట్టాయేమో అన్నట్లుగా ఉంటారు. ఈ వయస్సులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు ఆయన. రీసెంట్ గా మెగాస్టార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

టాలీవుడ్ పెద్దన్నగా మెగాస్టార్ కు బయట ఎంత ఫాలోయింగ్ ఉందో.. సోష‌ల్‌ మీడియాలో కూడా అంతే ఉంది. సోష‌ల్‌ మీడియా ప్లాట్ ఫాం వేదికగా తన ఫ్యామిలీ విశేషాలతో పాటు కెరీర్ గురించి షేర్ చేస్తుంటారు ఆయన. రీసెంట్ గా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైర‌ల్ గా మారింది.

తన భార్య సురేఖ గురించి మెగాస్టార్ చిరంజీవి, తన కొడుకు రామ్ చరణ్ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. వీరికంటే ఎక్కువగా కూడా వదిన గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉంటాడు. ఆమెను వదిన కాదని అమ్మ అని చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు.

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ఫిబ్రవరి 18వ తేదీ.. మెగాస్టార్ చిరంజీవి జీవిత భాగ‌స్వామి సురేఖ పుట్టిన‌ రోజు. దీన్ని పురస్కరించుకొని త‌న జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు శుభాకాంక్షలు చెప్పాడు.

నా జీవితానికి గ్రేటెస్ట్ పిల్లర్ త‌నే..
‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ..’ అని కవిత్వ రూపంలో కొనియాడుతూ పుట్టిన‌రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘నా జీవిత భాగస్వామి, నా జీవితానికి గ్రేటెస్ట్ పిల్లర్ అయిన సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కు తన భార్యతో క‌ల‌సి ఉన్న ఓ ఫొటోను కూడా చిరంజీవి షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన మెగా ఫాలోవర్స్, ఫాన్స్ సురేఖ‌కు వదిన సురేఖకు విషెస్ చెప్తున్నారు.

Exit mobile version