Chiranjeevi : జనసేనకు చిరంజీవి రూ.5 కోట్ల విరాళం.. కాళ్లు మొక్కిన పవన్

Chiranjeevi Pawan Kalyan
Chiranjeevi : జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిలిచి 5 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ముచ్చింతలలో జరుగుతుండగా పవన్ కళ్యాణ్, నాగబాబులు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. చిరంజీవి తమ్ముళ్లను ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా పవన్‌కు జనసేన పార్టీకి తోడ్పాటునందించేందుకు 5 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఉద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి కాళ్లకు మొక్కారు.. షూటింగ్ స్పాట్ లో ముగ్గురు కొణిదెల సోదరులు కాసేపు మాట్లాడుకున్నారు.
Read more : పెదకూరపాడులో వైసీపీ మూకల అరాచకం.. టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టే యత్నం..!
నిన్న అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ఏమోషనల్ గా మాట్లాడారు. పార్టీని నడిపించేందుకు డబ్బులు నా దగ్గర లేవని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు మాత్రమే ఉన్నాయన్నారు. ఆ సమావేశంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చిరంజీవిని కలచివేశాయి. తమ్ముడిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏకంగా రూ.5 కోట్ల పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడు.
ఇదిలా ఉంటే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Read more : పెట్రోల్ పోసుకున్న వెంటనే బండి స్టార్ట్ చేయొద్దు..ఈ వీడియో చూడండి..!