Chiranjeevi : పద్మశ్రీ, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. ఆయన కటౌట్ ఉంటే చాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిసినట్లే. ఇక దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులను తన వైపునకు లాక్కుంది కూడా మెగాస్టార్ చిరంజీవి. సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్న, వచ్చే వారిని ఆయన లైఫ్ జర్నీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.
మెగాస్టార్ తన నటన, డాన్స్ తో టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశాడు. జానర్ ఏదైనా ఇట్టే అందులో ఫిట్ అవుతాడు మెగాస్టార్. టాలీవుడ్ కు ఇన్నేళ్లు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్రం ఆయనకు గతంలో పద్మశ్రీ ఇస్తే.. ఇప్పుడు (2024) పద్మ విభూషణ్ ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఇప్పటికీ చిరు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తుంటారనడంతో ఎలాంటి సందేహం లేదు.
ఇవన్నీ పక్కన పెడితే.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చదువుకున్న 10వ తరగతి సర్టిఫికెట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సర్టిఫకేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని.. తండ్రి వెంకట్ రావు అని ఉంది. ఈ హీరో పుట్టింది పెనుగొడలో అని ఉంది. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ సేవ్ చేసుకుంటున్నారు.
మూవీస్ విషయానికస్తే.. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు చిరంజీవి ఏజ్ గురించి తెలుసుకుంటే 65 సంవత్సరాలు ఇప్పటికీ చిరు జిమ్ లో వర్కవుట్లు చేయడం నెటిజన్లు ఆశ్చర్య పరుస్తుంది. అట్లుంటది మెగాస్టార్ అంటే..