Chiranjeevi : సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత చిరంజీవి ‘ఖైదీ నెంబర్-150’తో మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ అప్రతిహతంగానే సాగుతోంది. ఒక్కటి, రెండు ఫ్లాపులు.. మూడు నాలుగు హిట్లతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దన్న ఎవరంటే ఠక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. అవును మరి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆరాధ్య అభిమాని ఆయన. ఆయన పేరు చెప్తేనే చాలు సినిమాలు బాక్సాఫీస్ కు వెళ్లాల్సిందే. ఇండస్ట్రీలోని చాలా పంచాయతీలను కూడా ఆయన పరిష్కరించారు.
అందుకే మెగాస్టార్ తో సినిమా చేసేందుకు దర్శకులు, నిర్మాతలు ఎగబడతారు. ఆయనతో సినిమా తీశామా ఇక ఇండస్ట్రీలో పాతుకుపోయినట్లే లెక్క. నిర్మాతలకు కాసుల వర్షం, దర్శకులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే మెగాస్టార్ డేట్ల కోసం పరితపిస్తుంటారు నిర్మాతలు, దర్శకులు. పదేళ్లు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు.
2023 ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. చిరంజీవిని ఎలా కోరుకుంటారో ఆయన కూడా అలానే కనిపించారు. ఈ సినిమాని దర్శకుడు కేఎస్ రవీంద్ర కాగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా.. ఇందులో డిఫరెంట్ రోల్ లో కనిపించిన చిరంజీవికి బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందించింది. నిర్మాతలకు భారీగానే లాభాలు తెచ్చిపెట్టింది. 2023 లో ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన మూవీగా రికార్డు తెచ్చిపెట్టింది.
అయితే ఇదే సంవత్సరం మరో సినిమాతో చిరంజీవి నిర్మాతలకు నష్టాలు కూడా తెచ్చిపెట్టారు. అదే ‘భోళా శంకర్’. తమిళంలోని వేదాళం సినిమా రీమేకే ఈ భోళా శంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర, కేఎస్ రామారావు మూవీని నిర్మించారు. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కాకున్నా.. ఆశించిన దానికన్నా తక్కువ కలెక్షన్లను సాధించింది. కనీసం పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాలో లాస్ ను మరో సినిమాతో పూడుస్తానని పొడ్రూసర్ కు చిరంజీవి హామీ ఇచ్చారట. ఏది ఏమైనా గతేడాది (2023) చిరంజీవి ఒక హిట్, ఒక ఫ్లాప్ ఇచ్చారని చెప్పవచ్చు.