JAISW News Telugu

Chiranjeevi-Surekha : చిరంజీవి-సురేఖ, వెంకటేష్-నీరజ అమెరికా పెళ్లి ఫొటోలు వైరల్

Chiranjeevi-Surekha

Chiranjeevi-Surekha, Venky Mama Pic Viral

Chiranjeevi-Surekha : టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి గుణ గణాలను చెప్పుకోవాలంటే సమయం సరిపోదేమో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగి నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పెద్దన్నగా మారాడు. మొదటి నుంచి ఆయనది ఒదిగి ఉండే మనస్తత్వమే. ఇక తన స్నేహితుల కోసం ఏదైనా చేయడం.. ఎంత దూరమైనా వెళ్లడం ఆయనకు అలవాటే.. మొదటి నుంచి ఫ్రెండ్ షిప్ కు ఎంతో విలువ ఇస్తారు మెగాస్టార్. ఇది చాలా సార్లు రుజువు కూడా చేశాడు. మెగాస్టార్ ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీని చేస్తున్నారు. ఇలాంటి కథతో సినిమా చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎంతో డెడికేషన్ కావాలి. ఈ మూవీ షూటింగ్ ఇటీవలనే ప్రారంభమైంది. 60వ పడిలోనూ యాంగ్ స్టార్లకు ధీటుగా పని చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉండే చిరంజీవి తన స్నేహితుడి కోసం ఖండాంతరాలను దాటి వెళ్లాడు. ఆ వివరాలు తెలుసుకుందాం..

మెగాస్టార్ స్నేహితుడి పేరే కుమార్ కోనేరు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో స్థిరపడ్డారు ఆయన. ఈయన మెగాస్టర్ కు చాలా ఇష్టమైన స్నేహితుడు. కుమార్ కొడుకు వివాహం లాస్ ఏంజిల్స్ లో ఇటీవల జరిగింది. ఈ వేడుకలకు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి వెళ్లారు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కూడా తన సతీమణి  నీరజతో కలిసి పెళ్లికి వచ్చారు. వారంతా కలిసి దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన టాప్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ వివాహానికి వీచ్చేశారు. అందులో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజే విశ్వ ప్రసాద్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మహేష్ బాబు రాజమౌళితో సినిమాను తెరకెక్కిస్తున్న  దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ కూడా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

Exit mobile version