Mansoor Ali : పార్టీ పేరుతో వేల కోట్లు దోచుకున్నాడు.. హీరోయిన్లకే పార్టీ ఇస్తాడు.. చిరంజీవిపై మన్సూర్ ఆరోపణలు..
Mansoor Ali Khan and Chiranjeevi Issue : మన్సూర్ అలీ ఖాన్ చేసే వ్యాఖ్యలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి.. ఈయన గురి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై పడినట్టు కనిపిస్తుంది.. తాజాగా ఈయన చిరంజీవిపై కామెంట్స్ చేస్తూ మన్సూర్ అలీ ఖాన్ పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి..
తమిళ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ గత కొద్దీ రోజుల క్రితం త్రిషపై కామెంట్స్ చేస్తూ లియో సినిమాతో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకుంటే లేవని బాధ పడుతున్నట్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.. దీంతో ఈయనపై సెలెబ్రిటీలు చాలా మంది విమర్శలు చేసి ఈ వ్యాఖ్యలను ఖండించారు.
మన మెగాస్టార్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. ఇలా చాలా మంది ఈ వ్యాఖ్యలపై మండిపడటంతో ఈయన క్షమాపణలు చెప్పగా వివాదం క్లోజ్ అయినట్టే అని చాలా మంది అనుకున్నారు. కానీ మన్సూర్ మాత్రం ఈ వివాదాన్ని వదలడం లేదు..
తనపై కామెంట్స్ చేసిన వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు.. చిరంజీవిపై 20 కోట్ల పరువు నష్టం దావా అలాగే ఖుష్బూ, త్రిషలపై 10 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలిపాడు.. అంతేకాదు చిరుపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయగా ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరంజీకి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడని కామెంట్ చేసాడు.. నాది వక్ర బుద్ధి అని చిరంజీవి అన్నారు.. మరి చిరంజీవి ఏం చేసాడు.. పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడు కానీ పేదవారికి సహాయం చేయలేదు.. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టాడు. వీళ్లంతా ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఆ డబ్బంతా వాళ్ళ కోసమే వాడుకుంటున్నారు అంటూ ఈయన ఆరోపణలు చేసాడు..
అంతేకాదు నేను చిరంజీవితో నటించాను.. కానీ నన్ను ఆయన పార్టీకి ఎప్పుడు పిలవలేదు.. ఆయన కేవలం హీరోయిన్లకే పార్టీ ఇస్తాడు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. పరువు నష్టం దావా వేసి ఆ డబ్బును మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు పంచుతాను అంటూ చెప్పుకొచ్చాడు.