JAISW News Telugu

Chiranjeevi-Nagababu : కూతుర్లు విడాకులు తీసుకున్నా కూడా అంత సంతోషంగా చిరంజీవి – నాగబాబు ఎలా ఉన్నారు? కారణం అదేనా!

Chiranjeevi-Nagababu

Chiranjeevi-Nagababu Daughter’s

Chiranjeevi-Nagababu : ఈమధ్య కాలం లో పెళ్లి అనే మహోన్నత హిందూ సంప్రదాయానికి బ్రష్టు పట్టిస్తున్నారు సినీ తారలు. అగ్ని సాక్షిగా మూడు ముళ్ళు వేసి, 7 అడుగులు నడిచి అశేష విశిష్ట అతిధులు, బందు మిత్రుల సమక్ష్యం లో వేదమంత్రాలతో జరిగే పెళ్ళికి ఎంతో విలువ ఉంటుంది. కానీ సినీ తారలు పెళ్లి చేసుకున్నని రోజులు కూడా ఈమధ్య కలిసి ఉండడం లేదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ విడిపోతూ ఉన్నారు.

ముఖ్యంగా విడాకుల ప్రస్తావన తీసుకొస్తే మన అందరికీ గుర్తుకు వచ్చేది మెగా ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్, చిరంజీవి చిన్న కూతురు శ్రీజా, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల వీళ్లంతా పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 12 ఏళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అవ్వడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. కానీ శ్రీజా, నిహారిక పెళ్ళైన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు.

ముఖ్యంగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజా అప్పట్లో శిరీష్ భరద్వాజ్ అనే అతన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొని చిరంజీవి పరువుని ఎలా అల్లరిపాలు చేసిందో మనమంతా చూసాము. ఆ తర్వాత రెండేళ్లకే అతనికి విడాకులు ఇచ్చేసి , చిరంజీవి వద్దకు వచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత చిరంజీవి కళ్యాణ్ దేవ్ అనే అతనికి ఇచ్చి గ్రాండ్ గా శ్రీజా కి రెండవ పెళ్లి చేసి చేసాడు. కొంతకాలం సంతోషం గా సాగిన వీళ్లిద్దరి దాంపత్య జీవితం కొంతకాలానికే తెగిపోయింది. ఇక మెగా బ్రదర్ నాగబాబు తన ముద్దుల కూతురు నిహారిక పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేసాడో మనమంతా చూసాము. ఇప్పటికీ ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈమె కూడా ఇటీవలే తన భర్త కి విడాకులు ఇచ్చేసింది.

ఇలా ఇద్దరు కూతుర్లు విడాకులు ఇచేసినప్పటికీ కూడా చిరంజీవి, నాగబాబు లలో ఎలాంటి బాధ లేదు. ఇష్టం లేని జీవితం బలవంతంగా మోస్తూ, జీవితాంతం బాధపడడం కంటే విడిపోవడం మంచిది అని వీళ్లిద్దరి సిద్ధాంతం అట. అందుకే ఎలాంటి బాధ లేదని తెలుస్తుంది. అంతే కాదు, వీళ్లిద్దరికీ తమ కూతుర్లు అంటే ప్రాణం, వాళ్లకు అండగా నిలబడడం తప్ప ద్వేషించడం తెలియదని అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Exit mobile version