Chiranjeevi : చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై ఉద్వేగం
Chiranjeevi : గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం అవుతోంది. తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం పద్మ విభూషణ్ తో గౌరవించడంతో చిరంజీవి ఆశ్చర్యపోయారు.
పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలియగానే మెగాస్టార్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎలా స్పందించాలో అర్థం కాలేదని అన్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద పురస్కారం పద్మ విభూషణ్ లభించడం గొప్పగా అనిపిస్తుందన్నారు. లక్షలాది మందిలో తనకు ఈ పురస్కరం దక్కడడం ఆనందంగా ఉందన్నారు.
నాకు దక్కిన గౌరవం, చూపిస్తున్న ప్రేమకు రుణం ఎలా తీర్చుకోను. నా బాధ్యత నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. పద్మ విభూషణ్ రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో తనకు ఇంత పెద్ద పురస్కారం ఇచ్చిందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిత్రపరిశ్రమలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవికి దక్కడం విశేషంగా చెబుతున్నారు. చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలకు దక్కిన పురస్కారంగా అభివర్ణిస్తున్నారు. భవిష్యత్ లో మరిన్ని అవార్డులు అందుకోవడం ఖాయమని పలువురు చెబుతున్నారు. ఇలా చిరంజీవిని ఈ అవార్డు వరించడం గమనార్హం.