Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఎన్నో బ్లాక్బస్టర్ గా నిలిచాయి. అందులో చిరంజీవి ఎక్కువగా మాస్ మూవీలో యాక్ట్ చేశారు. ఖైదీ మూవీ తో చిరంజీవి తన సత్తా నిరూపించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో ఆయనకు అవార్డులు వచ్చాయి. ఈమధ్య పద్మ విభూషణ అవార్డుని కూడా అందుకున్నాడు. చిరంజీవి నటించిన చంటబ్బాయి మూవీ అప్పట్లో ఫ్లాప్ తెచ్చుకోగా ప్రస్తుతం ఆ సినిమా గురించే చాలామంది డైరెక్టర్లు నేర్చుకుంటున్నారని వినికిడి.
చిరంజీవి సినిమాలతోనే కాకుండా రాజకీయంగా కూడా కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా నిలిచాడు. 1980 నుంచి ఇప్పటివరకు ఎవరు అగ్ర హీరో అని తెలుగులో ఉన్న అభిమానులను ఎవరిని పలకరించినా కూడా చిరంజీవి పేరే చెబుతారు.
అలాంటి చిరంజీవి అప్పట్లో ఎక్కువగా మాస్ చిత్రాలలో నటించేవారు కానీ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమాలో ఆయన చేసిన పాత్రకు ప్రస్తుతం చాలామంది ఫిదా అవుతున్నారు. కానీ ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో ఎక్కువ రోజులు నడవలేదు. ప్రేక్షకులు ఈ సినిమాకు రావడానికి ఎక్కువగా ఇష్టపడలేరు. కానీ ఈ సినిమా ఇప్పుడు చూసేవారు ఇంత క్లాసికల్ మూవీని అప్పట్లోనే జంధ్యాల ఎలా తీయగలిగారు.
ఈ మూవీలో ప్రతి సీను ఎప్పుడు చూసినా సరికొత్తగా కనిపిస్తుందని ఇంత గొప్ప డైరెక్షన్ ని చేసిన జంధ్యాల, నటించిన చిరంజీవి ధన్యులని అంటూ ఉంటారు. జంధ్యాల చిరంజీవితో కామెడీ చేయించడం ఇక్కడ కొసమెరుపు చిరంజీవి కూడా కామెడీ చేయగలరని నిరూపించారు. చంటబ్బాయి సినిమా కోసం జంధ్యాల చిరంజీవి ఇద్దరు చాలా కష్టపడ్డారు. అయితే ఈ మూవీని ఇప్పటి తరం దర్శకులు చాలామంది చూస్తూ దాని నుంచి ఎంతో నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. చంటబ్బాయి మూవీ అనేది చిరంజీవి కెరీర్ లోనే ఒక అత్యుత్తమ మూవీగా నిలిచిపోయింది.