Anil Ravipudi : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా చేరిన దర్శకుడు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘పటాస్’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన అనిల్ రావిపూడి, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. రీసెంట్ గానే ఆయన నందమూరి బాలకృష్ణ తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేసి భారీ హిట్ ని అందుకున్నాడు.
కేవలం కామెడీ సినిమాలను మాత్రమే కాదు, సెంటిమెంట్, ఎమోషన్స్ ఉన్న సినిమాలను కూడా తియ్యగలను అని ఈ చిత్రం తో నిరూపించుకున్నాడు. మినిమిమ్ గ్యారంటీ హిట్స్ ఇచ్చే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయనతో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అయితే చిరంజీవి కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆలస్యం అయ్యింది.
అయితే ఎట్టకేలకు చిరంజీవి తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ చిరంజీవి కోసం రాసుకున్న కథని రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్ కి వినిపించాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ కి కథ బాగా నచ్చడం తో వెంటనే ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడట. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అనిల్ రావిపూడి పై ఫైర్ అయ్యాడట. నీ దగ్గర వేరే కథ ఏదైనా ఉంటే అది చెప్పొచ్చు కానీ, నాకు చెప్పిన కథని వేరే హీరో కి చెప్పి ఓకే చేయించుకోవడం నన్ను అవమానించినట్టే. నీతో ఇక సినిమా చేసేది లేదు అని తెగేసి చెప్పాడట.
వాస్తవానికి ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్నాడు. వసిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకుంది. ఈ సినిమా పూర్తి అవ్వడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉండడం తో అన్ని రోజులు వెయిట్ చెయ్యలేక వెంకటేష్ కథ సిద్ధం గా ఉందా అనగానే చిరంజీవి కోసం రాసుకున్న కథ చెప్పాడని తెలుస్తుంది. మరి దీనిపై అనిల్ రావిపూడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. వెంకటేష్ తో చెయ్యబోయే సినిమా విశ్వంభర కి పోటీ గా సంక్రాంతికి విడుదల కాబోతుంది.