Chiranjeevi : కాసేపట్లో సింగపూర్‌కు చిరంజీవి దంపతులు, పవన్
Chiranjeevi : సినీ నటుడు చిరంజీవి, ఆయన భార్య , డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో సింగపూర్‌కు బయలుదేరనున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బాలుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడికి మెరుగైన వైద్యం అందించేందుకు పవన్ కళ్యాణ్ సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి దంపతులు కూడా పవన్‌కు తోడుగా ఉండేందుకు సింగపూర్‌కు వెళ్తున్నారు. వారి ప్రయాణం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ విషయం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.