
Kondagattu Hanuman Jayanthi Revenue
Kondagattu : కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా ఆలయానికి రూ.1,54,13,395 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ఈవో తెలిపారు. హనుమాన్ భక్తుల దీక్ష విరమణ ద్వారా రూ. 36,60,600, కేశఖండనము టికెట్స్ ద్వారా రూ. 12,01,550, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.16,52,300, లడ్డు విక్రయాల ద్వారా రూ. 74,12చ825, పులిహోర ద్వారా 14,86,120 వచ్చినట్లు ఈవో వివరించారు. గత ఏడాదితో పోలీస్తే ఈసారి ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు.
ఈ నెల 22 నుంచి నిన్నటి వరకు కొండట్టులో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు.