Chinese astronauts : ఆరు నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన చైనా వ్యోమగాములు
Chinese astronauts : చైనాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు సుమారు 6 నెలల తర్వాత అంతరిక్షం నుంచి తిరిగి భూమిపైకి చేరుకున్నారు. కాగా వీరు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆరు నెలల తర్వాత భూమిపైకి వచ్చారు. కమాండర్ చెన్ డాంగ్, వ్యోమగాములు లియు యాంగ్, కాయ్ జుజె ఆదివారం ఉత్తర చైనాలోని గోబీ ఎడారిలో ల్యాండింగ్ సైట్ లో క్యాప్సూల్ లో దిగారు. ల్యాండింగ్ అయిన 40 నిమిషాల తర్వాత వైద్య సిబ్బంది వ్యోమగాములను క్యాప్యూల్ నుంచి బయటకు తీసుకు వెళ్లారు. కాగా ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. భూమికి తిరిగొచ్చిన వ్యోమగాముల స్థాంలో మరో ముగ్గురు వ్యోమగాములు గత నెల 30న అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు.