Childrens Day Celebrations : డల్లాస్ లో NATS ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు

Childrens Day Celebrations

Childrens Day Celebrations

Childrens Day Celebrations : ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) ఆధ్వర్యంలో డల్లాస్‌లో ఏర్పాటు చేసిన బాలల సంబురాలు ఆనందంగా గడిచాయి. (జవహర్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14న) బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. 13 సంవత్సరాలుగా ఈ సంబురాలను నిర్వహిస్తున్నట్లు నాట్స్ అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని బాపు చెప్పారు. నాట్స్ డల్లాస్ విభాగాన్ని చైర్ పర్సన్ అరుణ గంటి అభినందించారు.

సెయింట్ మేరీస్ చర్చి ఆవరణలో నిర్వహించిన 13వ నాట్స్ బాలల సంబురాల్లో శాస్త్రీయ నృత్యం, నాన్ క్లాసికల్, శాస్త్రీయ సంగీతం, వెస్ట్రర్న్ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు వక్తృత్వం, పదకేళి తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 200 మందికి పైగా చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో ప్రతి విభాగంలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు నాట్స్ నిర్వాహకులు బహుమతులు అందించారు.

డల్లాస్ చాప్టర్ కార్యవర్గ సభ్యుడు రవి తుపురాని, శ్రీధర్ న్యాలమడుగుల, శ్రీనివాస్ ఉరవకొండ, పార్ధ బొత్స, శ్రీధర్ విన్నమూరి, సురేంద్ర ధూళిపాళ్ల, గౌతమ్ కాసిరెడ్డి, వెంకట్, నాగిరెడ్డి మందల, రాధిక, రవీంద్ర చిట్టూరి, గీతిక, మల్లిక, త్రినాథ్, ధృవ్, సాయి, యువ నిర్వాహకులు మనోజ్ఞ, నిత్య, రేహాన్, యషిత, వరిశ్, నిఖిత పాల్గొన్నారు. వీరితో పాటు నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, జ్యోతి వనం, మాదాల రాజేంద్ర తదితరులు సహకారాన్ని అందించారు.

TAGS