Police Warning : పిల్లలను ఓ కంట కనిపెట్టాలి.. పోలీసుల హెచ్చరిక..

Police Warning

Police Warning

Police Warning : నేటి బాలలే రేపటి పౌరులన్న సంగతి అందరికీ తెలిసిందే. బాల్యం ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ సాగుతుంటే యవ్వనం కూడా అంతే ఆనందంగా ఉంటుంది. అయితే బాల్యం (మైనర్)లో తప్పటడుగులు వేస్తే భవిష్యత్ నాశనం అవుతుంది. సాధారణంగా చిన్నారులు వేటివైపు అయినా తొందరగా ఆకర్షితులవుతారు. అది మంచి కావచ్చు.. చెడు కావచ్చు.. వీరినే డ్రగ్ మాఫియా టార్గెట్ చేసుకుంటుంది. పెడ్లర్ గా వాడుకుంటుంది.. లేదంటే బానిసలుగా మలుచుకుంటుంది.

దీనిపై పోలీసులు ఎప్పుటి కప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇటీవల మాధక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించారు. ర్యాలీలు తీయడం, బహిరంగ సభలు పెట్టి మరీ చిన్నారుల భవిష్యత్, డ్రగ్స్ కు బానిసైతే కోల్పోయే భవిష్యత్ గురించి వివరించారు.

అయితే పోలీసులు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించారు. ముఖ్యమంగా 9వ తరగతి దాటిన పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. ‘పిల్లలు ఎదుగురుతున్నారంటే వారికి చెడు దారులు సైతం ఎదురవుతాయని అర్థం. మంచి-చెడు మధ్య తేడా తెలియని వారినే డ్రాగ్ మాఫియా టార్గెట్ చేస్తుందని వివరించారు. అయితే చిన్నారుల సెల్ ఫోన్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని’ సూచించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇటీవల పబ్బుల్లో కూడా డ్రగ్స్ వాడకం పెరిగిపోతోంది. ఇటీవల హైదరాబాద్ లోని ఒక పబ్ లో నిర్వహించిన దాడుల్లో 24 మందికి పరీక్షలు చేయగా అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. ఒక వైపు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరో వైపు ఇలా ఇష్టం వచ్చినట్లు డ్రగ్స్ తీసుకోవడం పోలీసులను కవలవరానికి గురి చేస్తుంది. అందుకే చిన్న తనం నుంచే సరైన అవగాహన కల్పిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని తెలుస్తుంది. 

TAGS