Child marriage : 16 ఏళ్లకే బాల్య వివాహం.. తర్వాత భర్తకు విడాకులు.. ఒక స్టార్ హీరోతో ఎఫైర్.. ఆ నటి ఎవరంటే?

Heroine Child marriage
నటి ‘సరిత’ అంటే ఇప్పుడున్న జనరేషన్ కు తెలియదు కానీ.. మహేశ్ బాబు అర్జున్ సినిమాలో ప్రకాశ్ రాజ్ భార్య పాత్ర అంటే మాత్రం ఠక్కున తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఎంత పెద్ద విమర్శకుడైనా ఆ పాత్రకు హ్యాట్సాఫ్ అనాల్సిందే.

Heroine Saritha
లేడి నటి, ఆ రేంజ్ లో విలనిజం పండించడం అరుదని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. అత్త అంటే ఒకప్పుడు సూర్యకాంతం గుర్తుకు వచ్చేది. కానీ అంతకు మించి నటించింది సరిత. అండాలుగా సరిత నటించింది అనడం కంటే జీవించింది అనడం కరెక్టేమో..
కమర్షియల్‌గా డిజాస్టర్ అయినా.. సరితకు మాత్రం రికగ్‌నైజేషన్ వచ్చింది. అంతకు మందు మరో చరిత్ర, గుప్పెడంత మనసు, ఇది కథ కాదు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి మెప్పించింది.

ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి.. ఇండస్ట్రీలో బెస్ట్ పర్ఫార్మర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కేవలం నటనే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు సంపాదించుకుంది. సుజాత, భానుప్రియ, సుహాసని ఇలా.. పలువురు హీరోయిన్లకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది.80వ దశకంలో.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సరిత.. 500కు పైగా సినిమాల్లో నటించింది.
సినిమాలను పక్కన పెడితే పర్సనల్ లైఫ్‌లో సరిత ఇబ్బందులు ఎదుర్కొంది. 16 ఏళ్ల వయసులోనే అంటే బాల్య వివాహం జరిగింది. ఆరు నెలలు కూడా భర్తతో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంది.

Actress saritha
ఆ తర్వాత మలయాళ స్టార్ ముఖేష్‌తో రిలేషన్ షిప్‌లో కొన్నాళ్లు ఉండి వివాహం చేసుకుంది. 1988లో పెళ్లి చేసుకొని కొన్నాళ్లకే అంటే 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొడుకు శ్రవణ్‌ను తీసుకొని దుబాయ్ వెళ్లి అక్కడే స్థిరపడింది. తన కొడుకు శ్రవణ్ కూడా తమిళంలో హీరోగా ‘కళ్యాణం’ అనే సినిమాలో నటించాడు. చాలా కాలం తర్వాత చెన్నైకి వచ్చింది. గతేడాది రిలీజైన మహావీరుడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. సినిమాలో శివ కార్తికేయన్‌కు తల్లిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది.