cake order : బర్త్ డే రోజు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన.. కేక్‌ తిని చిన్నారి మృతి  

cake order

cake order

cake order online : కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. కస్టమర్క్యాన్సిల్చేసిన కేక్ ని ఇంటికి తీసుకెళ్లాడు. అది తిన్న తర్వాత, అతని ఐదేళ్ల కుమారుడు మరణించాడు. తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బాలుడి తండ్రి బాలరాజ్ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఓ కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతో కేక్ను ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు కేక్ షేర్ చేసుకుని తిన్న కొద్దిసేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ధీరజ్ ప్రాణాలతో బయటపడలేకపోగా బాలరాజ్- అతడి భార్య నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో కిమ్స్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి కుటుంబం ఆకస్మిక అనారోగ్యానికి దారితీసిన కారణాలపై మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పడ్డారు.

TAGS