JAISW News Telugu

Revanth Reddy:రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ ..హైక‌మాండ్‌తో కీల‌క‌ భేటీ

Revanth Reddy:తెలంగాణ‌లో త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌లి విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు, ప‌లువురు నేల‌తలు ఎదురుచూస్తున్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 19న మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్ర‌నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. మంత్రి విర్గ విస్త‌ర‌ణ‌, నామినేటెడ్ ప‌ద‌వుల‌పైన హైక‌మాండ్‌తో చ‌ర్చించ‌నున్నార‌ని తెలిసింది.

త్వ‌ర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగునుండ‌టంతో ముందుగా ప‌ద‌వుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్‌ని తీసుకురావాల‌ని భావిస్తున్నార‌ట‌. లోక్‌స‌భ అభ్య‌ర్థుల విష‌యంలోనూ ఇప్ప‌టికే ఓ జాబితాను సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కే తొలి ప్రాధాన్య‌త ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని నియోజ‌క వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులెవ్వ‌రూ విజ‌యం సాధించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ నాంప‌ల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్ మైనారిటీ విభాగం నుంచి మంత్రి ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్నాడు.

ఇక నిజామాబాద్ అర్బ‌న్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ష‌బ్బ‌లీర్ అలీకి మంత్రి ప‌ద‌వి ద‌క్కితే మాత్రం ఫిరోజ్‌ఖాన్‌కు అవ‌కాశాలు ఉండ‌వ‌ని స‌మాచారం. అలాగే మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీప‌డి ఓడిపోయిన మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు కూడా మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. అయితే ఆయ‌న‌ను మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ స్థానం నుంచి పోటీకి దింపాలనే ఆలోచ‌న‌లో పార్టీ అధిష్టానం ఉన్న‌ట్టుగా స‌మాచారం. అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, మ‌ధు యాష్కీ గౌడ్ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా వారి పేర్లు కూడా మంత్రి ప‌ద‌వుల కోసం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టుగా తెలిసింది.

ష‌బ్బీర్లీ, అంజ‌న్ కుమార్ యాద‌వ్‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చి వారిని ఎమ్మెల్సీలుగా గెలిపిస్తార‌ని పార్టీ కార్య‌కర్త‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక ఆదిలాబాద్ నుంచి ఇద్ద‌రు నేత‌లు మంత్రి ప‌ద‌వుల కోసం పోటీ ప‌డ‌తున్నారు. వారే గ‌డ్డం వివేక్‌, గ‌డ్డం వినోద్‌. వీరిద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్యే ప్ర‌ధానంగా పోటీ న‌డుస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. వీరిద్ద‌రు ఇప్ప‌టికే ఢిల్లీ అగ్ర నేత‌ల‌ను క‌లిశార‌ట‌. వీరితో పాటు చాలా మందే కాంగ్రెస్ ఆశావ‌హులు మంత్రి ప‌ద‌వి త‌మ‌కు ద‌క్కుతుంద‌నే ధీమాతో పోటీప‌డుతుండ‌టంతో మంత్రి ప‌ద‌వులు ఎవ‌రికి ద‌క్కుతాయ‌నే చ‌ర్చ కాంగ్రెస్ వర్గాల్లో న‌డుస్తోంది.

Exit mobile version