Bigg Boss : బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడకుండా చీఫ్ అయిన కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

Bigg Boss

Bigg Boss Tasks

Bigg Boss tasks : బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ మహిళా మెగా చీఫ్ గా నిలిచింది. ఎక్కువగా టాస్కులు ఆడకుండా సాదాసీదాగా సాగిపోయిన విష్ణుకు మెగా చీఫ్ రావడం చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోతున్నారు. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ కు వెళ్లకముందే బయట జనాలకు ఫేమస్. ముఖ్యంగా బిగ్ బాస్ హిస్టరీలో అత్యంత లక్కీ పర్సనాలిటీ ఎవరంటే విష్ణు ప్రియ అని చెప్పొచ్చు.

ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటూ లక్కీగా సేవ్ అవుతోంది. పోనీ హౌస్ లో ఏమైనా గేమ్స్ ఆడుతుందా అంటే అదీ లేదు. పృథ్వీ చుట్టూ తిరుగుతూ కాలం గడేపిస్తోంది. అయితే ఇలాంటి కంటెస్టెంట్ వేరే ఎవరైనా ఉంటే ఇప్పటికే వారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయేవారు. విష్ణు ప్రియ ఇప్పటి వరకు ఒక్క క్విజ్ టాస్క్ లోనే బాగా ఆడింది. మిగతా ఏ టాస్కుల్లో రాణించలేదు.

నిఖిల్, పృథ్వీలైతే టాస్కుల్లో తీవ్రంగా కష్టపడుతున్నారు. కొన్ని సార్లు వీరి ఆటను చూస్తే భయమేస్తోంది. అంతలా ప్రాణం పెట్టి టాస్కులు ఆడుతున్నారు. కానీ విష్ణుప్రియ మాత్రం ఏ మాత్రం టాస్కులు ఆడకుండా పృథ్వీని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడేస్తోంది. ఓజీ క్లాన్ లో ఆడుతున్నది. కాగా విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే నేను 9వ వారం మెగా చీఫ్ అవుతానని ప్రకటించింది. చెప్పిన విధంగానే 9 వ వారంలోనే మెగా మహిళా చీఫ్ గా నిలిచింది.

దీంతో బిగ్ బాస్ స్క్రిప్ట్ డ్ షో అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన విష్ణు ప్రియ మూడో స్థానంలో ఉంది. అయితే సీత లాంటి మంచి కంటెస్టెంట్ అన్ని విధాలుగా విష్ణు ప్రియ కంటే బెటర్ ప్లేయర్. కానీ ఆమెకు ఎక్కువ మంది ఫ్యాన్స్ లేరు. విష్ణుప్రియ చాలా రోజులుగా వివిధ షోలలో కనిపించి ఉండటంతో ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఈజీగా నామినేషన్స్ నుంచి బయటపడుతోంది.

TAGS