Flexi War : చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పై కొనసాగుతున్న  ఫ్లెక్సీ వార్

Flexi War

Flexi War

Flexi War : తెలంగాణలో రాజకీయ సంగ్రామం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సంరంభం కొనసాగుతోంది. పార్టీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అధికారం మాదంటే మాదే అని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ గురించి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యల గురించి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లెక్సీల రూపంలో తమ ఆగ్రహం వెల్లడిస్తున్నారు.

Flexi War

కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నాయి. తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాక సందర్భంగా నిన్న హైదరాబాద్ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

Flexi War
ఉద్యమ కారులను బలితీసుకున్న కాంగ్రెస్ ను బతకనీయొద్దంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీని అందరి విమర్శిస్తుంటే అది ఇంకా ప్రజల్లో ఉంటూ నాటకాలు ఆడుతోందని ఎద్దేవా చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పార్టీని నిలువెత్తు ఏకిపారేస్తున్నారు.

Flexi War
తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంత్ చారి తోపాటు పలువురి ఫొటోలు పెడుతూ కాంగ్రెస్ ను ఏకిపారేస్తున్నారు. పార్టీ విధానాల వల్ల ఉద్యమకారుల కుటుంబాలు నిర్వీర్యమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ ఫ్లెక్సీలు కట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న నేపథ్యంలో ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మామూలే అనే వాదనలు వస్తున్నాయి.

TAGS