Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి చికెను గున్యా

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యానికి గురయ్యారు. గత 25 రోజులుగా ఆయన చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవికి చోటు దక్కడంతో హైదరాబాద్ లో నిన్న (సెప్టెంబరు 22) అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కలిసి మెగాస్టార్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ అందించారు. చికెన్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్ మీదకు వెళ్తున్న సమయలో కూడా హీరో సాయి ధరమ్ తేజ్ చిరుకు సాయంగా వెళ్లాడు.
కాగా, మెగాస్టార్ నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. సినీ రంగ చరిత్రలోనే అత్యధిక పాటకు డ్యాన్సులు చేసిన తొలి వ్యక్తిగా ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ లో మెగాస్టార్ స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు గాను మెగాస్టార్ పేరు గిన్సిస్ రికార్డులోకెక్కింది.