Chhaava : ‘చావా’ దేశభక్తిని తట్టిలేపుతోంది.. స్వరాజ్య కాంక్షను చాటిచెబుతోంది
Chhaava: హిందీ భాషలో రిలీజ్ అయిన ‘చావా’ సినిమా ప్రేక్షకులలో దేశభక్తిని తిరిగిలేపుతోంది. విక్కీ కౌశల్ యాక్టింగ్ కు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సంభాజి మహారాజ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విధానం, మొఘలులతో పోరాడిన విధానం చూసి ప్రేక్షకులు థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నారు. జయహో సంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
సంభాజీ హిందీ సినిమా అంతా స్వరాజ్యం గురించే మాట్లాడుతోంది. విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు. అన్ని యూనిట్లు అద్భుతంగా పని చేశాయి. సినిమా యొక్క కథ, నేపథ్యం, విజువల్స్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరాఠాల పోరాట పటిమను కళ్లకు కడుతోంది.
ప్రేక్షకులు స్వరాజ్యం జన్మహక్కు అని.. నాటి మరాఠా యోధుల స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఘట్టాలను చూసి సెల్యూట్ చేస్తున్నారు. చావా సినిమా చూడడం వల్ల దేశభక్తిని చాటుకోవాలని అందరూ పిలుపునిస్తున్నారు.