Chennai Metro : చెన్నై మెట్రోలో వారాంతపు రోజుల్లో రూ. 100 అపరిమిత ప్రయాణం కల్పిస్తూ సరికొత్త పథకాన్ని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) శనివారం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ‘వన్ డే టూరిస్ట్ కార్డ్’ను కొనుక్కొని వారాంతపు రోజుల్లో ఎన్నిసార్లయినా తిరిగే వీలుంటుందను సీఎంఆర్ఎల్ తెలిపింది. రూ.150 చెల్లించి కార్డు తీసుకోవాలని, అందులో రూ.50 డిపాజిట్ గా తీసుకొని, కార్డు తిరిగి ఇచ్చే సమయంలో రూ.50 తిరిగి చెల్లిస్తారని పేర్కొంది.
గత ఏప్రిల్ నెలలో ప్రయాణికుల సంఖ్య 5.95 లక్షల మేరకు తగ్గింది. మార్చిలో 86.82 లక్షలు, ఏప్రిల్ లో 80.97 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ సరికొత్త పథకాన్ని సీఎంఆర్ఎల్ ప్రవేశపెట్టింది.