Cheetah : హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిరుత సంచారం

Cheetah

Cheetah in Hyd

Cheetah in Hyderabad City : హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిరుత సంచారం వైరల్‌గా మారింది. ఏ గ్రామం చివరన కాదు, నగర శివార్లలో.. నిత్యం వేలాది మంది సంచరించే మియాపూర్‌లో చిరుతపులి సంచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో స్థానికుల్లో కూడా భయాందోళన నెలకొంది. ఈ చిరుతపులి దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక నిర్మాణ పనులకు వచ్చిన కూలీలు చిరుతను చూసి వీడియో తీశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పుడు చిరుతపులిని వెతికే పనిని ప్రారంభించారు. స్థానికులను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రిపూట ఒంటరిగా బయట తిరగవద్దని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు సమీపంలోని చంద్రానాయక్ తండా వాసులను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు.

శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో చిరుత ఎక్కువగా సంచరిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు. కానీ, ప్రజల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. వెంటనే చిరుతను పట్టుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక నిర్మాణంలో భాగంగా తవ్వకాలు చేపట్టారు. చిరుతపులి వారిపైకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. 500 ఎకరాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. దట్టమైన అడవిలోకి వెళ్లి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

TAGS