JAISW News Telugu

Cheetah : శ్రీశైలంలో చిరుత కలకలం.. అరగంట డివైడర్ పై బైటాయింపు

FacebookXLinkedinWhatsapp
Cheetah

Cheetah

Cheetah : నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శ్రీశైలంలోని పాతాళ గంగ మెంట్ల మార్గానికి దగ్గరలో చిరుత సంచరించింది. సుమారు అరగంట పాటు రోడ్డు డివైడర్ పై కూర్చొంది. అలా డివైడర్ పై కొంత సమయం గడిపిన తర్వాత పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. గతంలోను ఇదే ప్రాంతంలో తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

గతంలో టోల్ గేట్ చెకింగ్ పాయింట్ దగ్గర భక్తులకు చిరుత కనిపించింది. చిరుత కనిపించిన దృశ్యాలను భక్తులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. కుక్కను వేటాడి నోటితో పట్టుకొని ఉన్న చిరుతను చూసి స్థానికులు భయపడ్డారు. ఈ నేపథ్యంలో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ, దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version