Karnataka Liquor : అంతర్రాష్ట చెక్ పోస్టు వద్ద తనిఖీలు.. కర్ణాటక మద్యం పట్టివేత

Karnataka Liquor
Karnataka Liquor : మంత్రాలయం మండలంలోని మాధవరం గ్రామ శివారులో ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా కారులో తరలిస్తున్న 2,880 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది. మద్యాన్ని తరలిస్తున్న పెద్దకడుబూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన చాకలి గంగాధర్, మంత్రాలయం మండలం పరమాన్ దొడ్డి తండాకు చెందిన సుగాలి రమేశ్ నాయక్ లను అదుపులోకి తీసుకొని, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.