Kalki 2898 AD Car : కల్కి 2898 ఏడీ కారు స్పెషల్ వివరాలు ఇవిగో చూసేయండి

kalki 2898 AD Car

kalki 2898 AD Car

Kalki 2898 AD Car : కల్కి 2898 ఏడీ సినిమా కోసం మహీంద్రా కంపెనీ సరికొత్త కారును తయారు చేసింది. కారు టైర్లు చాలా పెద్దగా ఉన్నాయి. దాదాపు మనిషి నిలుచుంటే అంత ఎత్తులో కారు టైర్లు ఉండటం ఇదే మొదటి సారి కావచ్చు. అంతకు ముందు ఇలాంటి కార్లు ఎక్కడ తయారు చేసిన దాఖలాలు లేవు. కారు టైర్ సైజు 34.5 ఇంచెస్ గా ఉంది. టైర్ లెన్త్ 6075 మిల్లీ మీటర్లు, విడ్త్ 3380 మిల్లీ మీటర్లు, హైట్ 2186 మిల్లీ మీటర్లుగా ఉన్నాయి.

కారు టైర్లను సియట్ టైర్ల సంస్థ స్పెషల్ గా తయారు చేసింది. కొయంబత్తూరులోని మహేంద్ర కంపెనీ, జేఎం మోటార్స్ వారు సంయుక్తంగా వీటిని  తయారు చేశారు. అయితే ఈ కారు కు వెనకాల ఒక టైర్ మాత్రమే ఉంది. కల్కి మూవీ టీజర్ లాంచ్ సమయంలో ప్రభాస్ దీని లో నుంచి బయటకు వచ్చాడు. కారుకు  వెనకాల ఉన్న టైర్ రౌండ్ గా కూడా తిరగగల సామర్థ్యంతో కనిపెట్టారు.

అసలు ఇప్పటి వరకు భూమి మీద ఇలాంటి కారు ఒకటి ఉందని ఎవరికీ తెలీదు. అంతే ఈ కారు ద్వారా కల్కి 2898 ఏడీ మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎక్కడికో తీసుకెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.  సినిమా కోసమే దీన్ని తయారు చేయించారంటే భారీ బడ్జెట్ సినిమాతో ప్రభాస్ ను మళ్లీ పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టనున్నారు.

ఇప్పటి వరకు సినిమాల కోసం సెట్స్ వేయడం, విదేశాలకు వెళ్లి షూటింగ్ లు చేసేవారు. కానీ కల్కి మూవీతో డైరెక్టర్ సరికొత్త పంథాను ఎంచుకున్నాడు. అతడు తయారు చేయించిన కారు తో సినిమాలో ఏమేం మ్యాజిక్ లు చేయనున్నాడో అని ప్రేక్షకులు ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. జూన్ 29 న కల్కి మూవీని రిలీజ్ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టారు. ప్రభాస్ కెరీర్లో ఈ చిత్రం మైలురాయిగా మిగిలిపోతుందని నమ్ముతున్నారు.

TAGS