JAISW News Telugu

TATA SUV Cars : టాటా నుంచి తక్కువ ధరలో ఎస్‌యూవీ.. 27 కి.మీల మైలేజ్‌.. అదిరిపోయే ఫీచర్లు..

TATA SUV Cars

TATA SUV Cars

TATA SUV Cars : దేశవాలీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ సబ్ 4 మీటర్ SUV పంచ్ ‘ఫేస్ లిఫ్ట్’ వెర్షన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల టెస్ట్ చేస్తూ కనిపించింది. దీని డిజైన్ పంచ్ EV (ఎలక్ట్రిక్ వెహికిల్) నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి కొత్త గ్రిల్, LED DRL, కొత్త హెడ్‌లైట్లు ఇవ్వవచ్చు.

ఈ మైక్రో SUV సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్తగా అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. వెనుక మోడల్ టెయిల్‌లైట్లు. బంపర్‌లో కొన్ని అప్‌డేట్లు ఉన్నాయి. ఇది హ్యుందాయ్ ఎక్సెటర్ తో పోటీ పడుతోంది. ధర పరిధిలో మారుతి ఫ్రాంక్‌లు, సిట్రోయెన్ C3, నిస్సాన్ మాగ్నైట్, మారుతి ఇగ్నిస్, రెనాల్ట్ కిగర్ తో పోటీపడుతుంది.

టాటా పంచ్ మొదటి సారి 2021లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆగస్ట్ 2023లో ఇది ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో CNG. జనవరి-2024లో ఎలక్ట్రిక్ వెర్షన్ రిలీజ్ చేశారు. 2025లో కూడా దీన్నే అప్ గ్రేడ్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

CNG మోడ్‌లో 27 km/kg మైలేజీ..
భారతీయ మార్కెట్ లో మైక్రో SUV సెగ్మెంట్‌లో తక్కువ ధరకు దొరికే CNG కారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో సేఫ్టీ రేటింగ్‌ లో 5 స్టార్స్ దక్కించుకుంది. దీని బేసిక్ మోడల్ ధర రూ.6.13 లక్షలు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెట్రోల్ మోడ్‌లో 20 కి.మీ/లీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 18 కి.మీ/లీటర్, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో CNG మోడ్‌లో 27 కి.మీ/కిలో మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త పంచ్ క్యాబిన్ ఫొటోను టాటా మోటార్స్ ఇంకా బయట పెట్టలేదు. కాబట్టి లోపలి నుంచి ఎలా ఉంటుందో చెప్పేందుకు వీలు కాదు. కానీ, పంచ్ EV తరహాలో కొత్తగా ఉంటుందని భావిస్తున్నారు. రెండు సిలిండర్లు ఉన్న టాటా పంచ్ ఇతర CNG కార్ల కంటే ఎక్కువ బూట్ స్పేస్ ఉంటుంది. పంచ్ iCNG 210 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్‌కు 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. ఇన్నే అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పంచ్. ఈవీ డ్యాష్‌బోర్డ్‌లో రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ రావచ్చు. ఇదే కాకుండా, పంచ్ EV 360-డిగ్రీ కెమెరా, లెథర్ సీట్లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ సీట్లు వెంటిలేటెడ్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Exit mobile version