JAISW News Telugu

Chatting : యువతిలా చాటింగ్.. రూ.14 లక్షలు ఛీటింగ్

Chatting

Chatting

Chatting : స్నాప్ చాట్ లో యువతిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేసిన ఐటీ ఎంప్లాయ్ నుంచి డబ్బులు వసూలు చేసిన యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంకు చెందిన ఎం.అశోక్ రెడ్డి (23) బెంగళూరులో ఉంటూ బెట్టింగ్ లు, చెడు అలవాట్లకు బానిసగా మారాడు. స్నాప్ చాట్ లో ప్రణీతరెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. దానిని మియాపూర్ కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి యాక్సెప్ట్ చేశాడు. దీంతో అతనితో అశోక్ రెడ్డి చాటింగ్ చేస్తూ.. లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకొందామని ప్రపోజ్ చేశాడు.

దీంతో ఆ ఐటీ ఉద్యోగి తన ఫొటోలను, పర్సనల్ విషయాలను షేర్ చేశాడు. ఆ తర్వాత అశోక్ రెడ్డి ఎమర్జెన్సీగా డబ్బు కావాలని, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని రూ.14 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సైబర్ క్రైం పోలీసులను కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి శుక్రవారం నిందితుడు అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే అశోక్ రెడ్డి మూడు సైబర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

Exit mobile version