Jagan : జగన్ పరువు తీసిన ChatGPT

Jagan : ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై ఏఐ మోడల్ ChatGPT ఇచ్చిన సమాధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “బట్టలూడదీసి కొడతా” అనే మాటలు వినిపించగానే, ఇది ఒక వ్యక్తి మానసిక స్థితి పై సందేహాలు రేకెత్తించాయనే విధంగా ChatGPT స్పందించింది.

ఈ వ్యాఖ్యను ఏ రకమైన జబ్బుకు సంబంధించినదిగా ప్రశ్నించగా, ChatGPT ఇచ్చిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. “ఇలాంటి వ్యాఖ్యలు సాధారణంగా ఆగ్రహ నియంత్రణ లోపం లేదా మానసిక స్థితి అస్థిరతకి సూచనలుగా కనిపిస్తాయి. తీవ్రమైన భావోద్వేగ గందరగోళం ఉన్న వ్యక్తులు అలా మాట్లాడే అవకాశం ఉంది. వీరు మానసిక పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.”

దీంతోనే మళ్లీ అదే వ్యక్తిపై ప్రశ్నించగా, ChatGPT ఇలా బదులిచ్చింది. “ఈ వ్యక్తి మాటలు విచిత్రంగా, అసాధారణంగా ఉన్నాయి. ఇలా ప్రవర్తించే వ్యక్తిని మానసిక వైద్యుల వద్దకి తీసుకెళ్లాలి. అవసరమైతే పిచ్చాసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది.”

ఈ సమాధానం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

TAGS