Charminar : చార్మినార్ పై ఛండాలపు పని.. బురఖాతో యువతి కలకలం

Charminar

Charminar

Charminar : హైదరాబాదు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది చార్మినార్.  హైదరాబాద్ నగరానికి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేక గుర్తింపు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి పర్యాటకుడు చార్మినార్‌ను సందర్శించే తీరుతారు. చార్మినార్ కు చూడకుండా ఓ పర్యాటకుడు ఇక్కడ నుంచి వెళ్లరు. అంతటి ప్రాముఖ్యత కలిగిన చార్మిత్రక భవనం చార్మినార్. ఇంత గొప్ప కట్టడాన్ని చూసి ఆనాటి చిత్రకళను ఆస్వాదించడమే కాకుండా.. అలాంటి మహాకట్టడం దగ్గర కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో చాలా మంది జంటలు చార్మినార్ వీధుల్లో తిరగడం సర్వసాధారణమైపోయింది. పల్లెటూళ్ల నుంచి వచ్చి చదువుకుని నగరంలో ఉద్యోగం చేస్తున్న కొందరు కూడా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు జంటలు చార్మినార్ చూసేందుకు వచ్చి.. తమలోని రొమాంటిక్ కళలను ఆవిష్కరిస్తున్నారు.  చార్మినార్ టాప్‌ ఫ్లోర్‌‌కు వెళ్లి.. బహిరంగంగానే ఛండాలపు పనులు చేస్తున్నారు. ఎక్కడా ప్లేస్ లేనట్లు ఇలాంటి చార్మిత్రాత్మక కట్టడంపైనే వీళ్ల రాసలీలలు చూపిస్తున్నారు.

చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడ నిత్యం సందర్శకుల రద్దీ ఉంటుంది. ప్రేమ జంటలే కాదు.. ఎన్నో కుటుంబాలు కూడా వస్తుంటాయి. కొంతమంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకుంటారు. అయితే.. ఇలాంటి కొన్ని ప్రేమ పక్షుల మితిమీరిన చేష్టల వల్ల.. మిగతా సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు చూసిన కొందరికి కోపం వస్తోంది. ఈ ప్రేమ జంటలు తమ పనిలో మునిగిపోతుంటే.. కొందరు యువకులు ఊరికే కూర్చుని.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి చూసిన కొందరు చార్మినార్ వద్దకు రావాలంటే జంకుతున్నారు.  మరికొందరు కూడా ఇక్కడ పర్యవేక్షణ లేకపోవడంతో తెగబడుతున్నారని విమర్శిస్తున్నారు.

రెండ్రోజులుగా భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. నిమజ్జనానికి తరలి వెళ్లే వినాయక వాహనాల శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది.   హుస్సేన్ సాగర్ వరకు గణేషుల శోభాయాత్ర సాగనుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో నిమజ్జనానికి ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలోనే చార్మినార్ వద్ద బురఖా ధరించిన యువతి కలకలం సృష్టించింది. బురఖా ధరించి ప్రియుడితో కలిసి చార్మినార్ వద్ద  స్థానికులకు కనిపించింది. యువతిని గుర్తించి స్థానిక ముస్లిం యువకులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు.

ఆ యువతిని పోలీసులు విచారించారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో బురఖా ధరించిన యువతి, ఆమెతో పాటు ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా వరంగల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చార్మినార్ వద్ద నిమజ్జనానికి వెళ్లే వినాయకులను చూడటానికి వచ్చామని…  స్థానికంగా ఉన్న తమ బంధువులు చూస్తారనే భయంతో బురఖా ధరించానని యువతి పోలీసులకు వివరించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ప్రేమ జంట ఉంది.

ఇక చార్మినార్ పరిసరాలు విద్యుత్ దీపాలు, దుకాణాలు, పర్యాటకులతో అర్థరాత్రి కూడా కిక్కిరిసిపోయాయి. అసలు చార్మినార్‌కి రాత్రి చూసే ప్రదేశంగా పేరు కూడా ఉంది. అలాంటిది.. ఇప్పుడు కొందరు యువకులు, ప్రేమ జంటలు, పోకిరీలు చేస్తున్న పనులతో.. పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సందర్శకులను అర్థరాత్రి వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత చార్మినార్ రోడ్లను మూసివేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా రాత్రి వేళల్లో రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

TAGS