Char Dham Yatra : చార్ ధామ్ యాత్రికులు.. రిజిస్ట్రేషన్ చేసుకోండి

Char Dham Yatra

Char Dham Yatra

Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉత్తరాఖండి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చార్ ధామ్ యాత్ర కోసం భక్తులు గంగోత్రి మరియు యమునోత్రికి పోటెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రలో అనుమతించబోమని సీనియర్ పోలీసు అధికారి అర్పన్ యదువంశీ తెలిపారు. యాత్ర మార్గంలో చెక్ పోస్టుల వద్ద రిజిస్ట్రేషన్ లేని వాహనాలను అనుమతించబోమని వెల్లడించారు.

అంతేకాకుండా చార్ ధామ్ యాత్ర భక్తులకు కేదార్ నాథ్ ఆలయం వద్ద మొబైల్స్ ను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆలయానికి 200 కి.మీ.ల దూరం వరకు మాత్రమే మొబైల్స్ తీసుకు వెళ్లవచ్చునని అన్నారు. యాత్రకు సంబంధించిన తప్పుదోవ పట్టించే వీడియోలు లేదా రీల్స్ ను అప్ లోడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

TAGS