JAISW News Telugu

Andhra Pradesh : ఏపీ లో మారుతున్న పేర్లు 

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడయ్యాయి. కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఏర్పడ్డాయి. కాంగ్రెస్, వైసీపీ ఒంటరిగానే రంగంలోకి దిగాయి. కేవలం జగన్ ను అధికారం నుంచి దించడానికి మూడుపార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. జగన్ మాత్రం రెండోసారి అధికారం తనదే అనే ధీమాలో ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. పోలింగ్ జరిగిన నాటి నుంచి ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యే నాటి వరకు కూడా ఏపీ లో కూటమిదే అధికారం అంటూ పలు సర్వే సంస్థలు కోడై కూసినవి. 

వైసీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు. ఎంతో ధీమాగా ఉన్న జగన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 11 మంది మాత్రమే వైసీపీ తరుపున అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ప్రజల్లో ఏమేరకు ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు. 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేస్తే నలుగురు మాత్రమే విజయాన్ని అందుకున్నారు. వైసీపీ పరిస్థితి అటు పార్లమెంటు లోనూ, ఇటు అసెంబ్లీ లోనూ  పెద్ద దెబ్బ తగిలింది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం ప్రతిపక్ష పార్టీ సాధించిన స్థానాలను కూడా దక్కించుకోక పోవడంపై ఆశ్చర్యానికి గురిచేసింది వైసీపీ ఫలితం.   

ఎట్టకేలకు కూటమి అధికారం చేప్పట్టబోతోంది. ప్రమాణస్వీకారం ముహూర్తం కూడా ఖరారు అయ్యింది. 2019 లో అధికారం చేపట్టిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ శాఖల పేర్లను తనకు అనుకూలంగా మార్చివేసింది. చంద్రబాబు నాయుడు పరిపాలన పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో వైసీపీ పెట్టిన పేర్లను చెరిపివేస్తున్నారు. వాటి స్థానం లో కొత్త ప్రభుత్వానికి సముచితమైన పేర్లను పెట్టబోతున్నారు. 

విశాఖ పట్టణం బీచ్ లో డాక్టర్ వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా ఉండేది. ఇప్పుడు ఆ పేరు తొలగించి ఆ పేరు స్థానంలో అబ్దుల్ కలాం పేరును పెట్టారు. విజయవాడ లో ఉన్న డాక్టర్  వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును తొలగించి దాని స్థానంలో ఎన్టీఆర్ అనే పేరును నమోదు చేశారు.

Exit mobile version