Weather in Delhi : ఢిల్లీలో మారిన వాతావరణం.. ఈదురుగాలులతో తీవ్ర ఇబ్బందులు

Weather in Delhi
Weather in Delhi : శుక్రవారం రాత్రి ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు అవస్థల పాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేల కూలడంతో పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కొన్ని ఏరియాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్ కు మళ్లించారు. తీవ్రమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్-58లో ఒక భవనం మరమ్మతు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్ కూలిపోవడంతో పలు కార్లు దెబ్బతిన్నాయి.
నేడు (శనివారం) గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తేలికసాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 29 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ గా ఉండే అవకాశముందని సూచించింది.