JAISW News Telugu

AP Government : ఏపీలో మార్పు మొదలైంది..

AP Government

AP Government

AP Government : ప్రభుత్వం ఎలా ఉండద్దో.. పాలకులు ఎలా నడచుకోవద్దో.. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వాన్ని కేస్ స్టడీగా తీసుకొని నాయకులు పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, మంత్రులకు పదే పదే చెప్తుంటారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు, అధికారులకు గౌరవం ఇవ్వకుండా వైసీపీ నాయకులు చేసిన అహంకార పూరిత ప్రవర్తనను చూసి ప్రజలు వైసీపీకి  11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్షం హోదా లేకుండా పాతాళానికి తొక్కారు.

ఇప్పుడు ప్రభుత్వం మారింది.. పాత సంస్కృతులు కనిపించొద్దు అంటూ బాబు తన అమాత్యులకు హెచ్చరికలు చేస్తున్నారు. బాబు అధికారంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అధికారులు, పార్టీ శ్రేణులు అన్నీ చట్టానికి లోబడే పని చేయాల్సి ఉంటుంది.

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు రాష్ట్రంలో చర్చకు వచ్చింది. రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్ ఇవ్వాలని మంత్రి భార్య హరిత పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై చంద్రబాబు స్పందించారు.

స్వయంగా మంత్రి రాం ప్రసాద్ కి ఫోన్ చేసి ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల పట్ల దురుసుగా, అగౌరవంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని, పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందంటూ హెచ్చరించారు. మంత్రి కూడా విచారణ వ్యక్తం చేశారు.

మంత్రిని వివరణ కోరినందుకు చంద్రబాబు తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చేసిన తప్పులను వెనుకేసుకు వచ్చిన జగన్ తన పతనం తానే కొని తెచ్చుకున్నారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. తప్పు తప్పేనని. జాగ్రత్తగా వ్యవహరించకుడా జగన్ లాగా పాతాళానికి తొక్కుతారని తెలుసుకున్న బాబు ఆ తీరుగా వ్యవహరించకుండా హద్దులు దాటితే మంత్రులైనా.. పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా ఉపేక్షించేది లేదని చెప్పారు.

ఒక పక్క ప్రభుత్వ మెయిన్ పిల్లర్లు బాబు, పవన్, లోకేష్ పరదాలు పక్కన పెట్టి సామాన్యుడిలా జనాల్లో కలిసిపోతుంటే పార్టీ నేతలు ఆడంబరాలకు పోతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా వైసీపీకి కత్తులు ఇవ్వడం మంచింది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Exit mobile version