JAISW News Telugu

Silk Smitha Biopic:సిల్క్ స్మిత బాయోపిక్‌..హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Silk Smitha Biopic:సిల్క్ స్మిత.. ప్రేక్ష‌క ర‌సిక హృద‌యాల్లో చెర‌గ‌ని సంత‌కం. 1980, నుంచి 90వ ద‌శ‌కం వ‌ర‌కు తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన మార్కు అందం, అభిన‌యంతో ఉర్రూత‌లూగించింది. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికీ ఓ మిస్ట‌రీలానే మిగిలిపోయింది. కుర్ర‌కారు ఆరాధ్య దేవ‌త‌గా నీరాజ‌నాలందుకున్న సిల్క్ స్మిత జీవిత క‌థ స్ఫూర్తితో ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సినిమాలొచ్చాయి. నేడు ఆమె జ‌యంతి. సిల్క్ స్మిత మ‌ర‌ణించి దాదాపు 25 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌టికీ ఆమె పేరు మారుమ్రోగుతూనే ఉంది.

సిల్క్ స్మిత జీవిత క‌థ ఆధారంగా మ‌రో సినిమా తెర‌పైకి రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా ఈ బ‌యోనిక్‌ని రూపొందించ‌బోతున్నారు. సెక్సీ సిరేన్‌గా తన మ‌త్తు క‌ళ్ల‌తో కోట్లాది మందికి నిత్ర‌లేకుండా చేసిన సిల్క్ స్మిత పాత్ర‌లో క్రేజీ న‌టి చంద్రిక ర‌వి న‌టిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ భారీ సినిమాకు జ‌య‌రామ్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `సిల్క్ స్మిత ది అన్ టోల్డ్ స్టోరీ` పేరుతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

డిసెంబ‌ర్ 2, శనివారం సిల్క్ స్మిత జ‌యంతిని పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం స్మిత బ‌యోపిక్‌ ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. ఇందులో చంద్రికా ర‌వి అచ్చం సిల్క్ స్మిత‌లా క‌నిపించారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ పోస్ట్ సినీ ప్రియుల్ని, ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ్లామ‌ర‌స్ తార‌గా వెండితెర‌పై సిల్క్ స్మిత ఓ వెలుగు వెలిగారు.

అల‌నాటి స్టార్ హీరోల సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేసి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆమె అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. వ్య‌క్తిగ‌త జీవితంతో పాటు సినీ జీవితంలోనూ చేదు పంఘ‌ట‌న‌లు ఎదుర్కొన్న సిల్క్ స్మిత 1996, సెప్టెంబ‌ర్ 23న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే మిగిపోయింది. ఆమె జీవితం ఆధారంగా విద్యాబాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `డ‌ర్టీపిక్చ‌ర్‌` రూపొందింది. బాలీవుడ్‌లో నిర్మించిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు సిల్క్ స్మిత జీవిత‌క‌థ‌ని మ‌రో సారి తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇందులో న‌టిస్తున్న చంద్రికా ర‌వి తెలుగులో బాల‌కృష్ణ న‌టించిన `వీర సింహారెడ్డి`లో న‌టించారు. ఇందులో ఆమె ప్ర‌త్యేక గీతం చేశారు.

Exit mobile version