JAISW News Telugu

Krishna-Vijay Nirmala : సూపర్ స్టార్ కృష్ణ-విజయ నిర్మల వివాహం వెనుక చంద్రమోహన్.. ఏం చేశారో తెలుసా?

Krishna-Vijay Nirmala

Krishna-Vijay Nirmala Marriage Behind Chandra Mohan

Krishna-Vijay Nirmala Marriage Behind Chandra Mohan : సూపర్ స్టార్ కృష్ణ స్టార్ డైరెక్టర్ విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరు వివాహానికి ముందు కొంత కాలంగా ప్రేమించుకున్నారట. ఇద్దరికీ సెకండ్ మ్యారేజ్ అయినా కూడా టాలీవుడ్ లో ఆదర్శ జంటగా కొనసాగారు కృష్ణ, విజయ నిర్మల. తన సూపర్ స్టార్ కోసం విజయ నిర్మల కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించింది. అయితే వీరి లవ్, వివాహం వెనుక చంద్రమోహన్ ఉన్నారు.

దాదాపు సూపర్ స్టార్ తరంలో వచ్చినా.. చంద్రమోహన్ చాలా సినిమాలు చేశారు. వందకు పైగా సినిమాల్లో హీరోగా చేసిన ఆయన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. ఆయన కళాతపస్వి దర్శకుడు కే విశ్వనాథ్ కు దగ్గరి బంధువు. చంద్రమోహన్ కు కృష్ణ, విజయ నిర్మల కుటుంబంతో మంచి సంబంధాలు ఉండేవి.

కృష్ణను హీరోగా పెట్టి విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాలు కొన్నయితే.. ఆయన పక్కన హీరోయిన్ గా చేసిన సినిమాలు మరికొన్ని. వీరిద్దరూ కలిసి 40కి పైగానే సినిమాల్లో నటించారు. ఆసమయంలో విజయ నిర్మల దర్శకత్వం అంటే దాదాపుగా హీరోగా కృష్ణనే ఉండేవారు. దీంతో వీరు ప్రేమలో పడ్డారు. అయితే, ఇద్దరికి ఇటు భార్య, అటు భర్త, పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

ఆ టైములో వారికి అండగా నిలిచిన వ్యక్తి చంద్రమోహన్. వారికి మనోధైర్యం ఇవ్వడంతో పాటు దగ్గరుండి మరీ వివాహం చేయించారట. తిరుపతిలో ఈ జంట ఒక్కటవగా దగ్గరుండి పనులు చూసుకుంది చంద్రమోహనే నంట. ఈ విషయాలను చంద్రమోహన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

కృష్ణ, విజయ నిర్మల, మేకప్ మ్యాన్, విజయ నిర్మల అసిస్టెంట్, చంద్రమోహన్ తో పాటు పవన్ కుమార్, ఒక జర్నలిస్ట్ మాత్రమే వీరి పెళ్లిలో ఉన్నారట. ఈ వివాహంతో చంద్ర మోహన్ కృష్ణ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడట. 

Exit mobile version