Chandrababu Victory : చంద్రబాబు విక్టరీ.. కేక్ కట్ చేసి ఫ్యామిలీ సంబరాలు
Chandrababu Victory : ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసి క్లీనస్వీప్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ అందరికీ తినిపించాడు.
చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫొటోలు దిగారు. వారిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, యువనేత నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తదితరులు ఉన్నారు. కాగా, కాసేపట్లో చంద్రబాబు నాయుడి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన చర్చించనున్నాయి.
చంద్రబాబు నాయుడిని బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సిద్ధార్థ్ సింగ్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకి మరికొందరు నేతలు కూడా శుభాకాంక్షలు చెప్పారు.